Trump: ఇరాన్‌పై దాడులు సరైనవే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు
- ఇరాన్‌పై దాడులు సరైనవే
- ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు
- ఇరాన్ అణు చర్చలకు రావాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. 24 గంటల వ్యవధిలోనే మరోసారి శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంలో వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎడతెరిపిలేకుండా దాడులు చేశాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా.
ఇది కూడా చదవండి: Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
Also Read
- US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్‌లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికా.. ఇజ్రాయెల్‌కు చాలా దగ్గరగా ఉందని.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ నెంబర్ వన్ మిత్రదేశం అని పేర్కొన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోని ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే.. న్యూక్లియర్ డీల్ కోసం ఇరాన్‌కు 60 రోజుల సమయం ఇచ్చాం.. న్యూక్లియర్ డీల్‌పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..
అణు ఒప్పందం గురించి ఇరాన్‌కు దాదాపు 60 రోజులు సమయం ఇచ్చాం.. ఈరోజు 61వ రోజు.. ఇరాన్‌కు దౌత్యం.. సంభాషణల ద్వారా తగినంత సమయం ఇచ్చామని.. అయినా కూడా పట్టించుకోలేదని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ దాడి చేస్తానంటే మొదట్లో ఆపామని.. కానీ ఇరాన్ తన పరిధి దాటడంతో కష్టాలు కొని తెచ్చుకుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగడం గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో అణు చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఇంకా సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఒమన్‌లో జరగనున్న చర్చలకు వాషింగ్టన్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందనే విషయం తనకు సందేహంగానే ఉందన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ జూన్ 15న ఇరాన్ ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇప్పటికైనా సమయం మంచి పోలేదని.. ఇంకా ఆలస్యం కాకముందే ఇరాన్ ఒప్పందం చేసుకుంటే మంచిది అని హితవు పలికారు. ఇరాన్ ప్రతిదాడుల గురించి స్పందిస్తూ.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.
ఇక శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన మొదటి దాడికి ప్రతీకారంగా టెహ్రాన్.. టెల్ అవీవ్ వైపు 100 డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైన్యం… డ్రోన్లను అడ్డుకుందని పేర్కొంది. ఇజ్రాయెల్ భూభాగం వెలుపలే వాటిని అడ్డుకున్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు చేదు అనుభవం ఎదురవుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..