Trump: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. ఫేక్ మీడియా హైలెట్ చేయలేదు.. ట్రంప్ ధ్వజం
- ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం
- ఫేక్ మీడియా హైలెట్ చేయలేదు
- ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశామని.. కానీ కొన్ని మీడియా సంస్థలు కవరేజ్ చేయలేదని ట్రంప్ విమర్శించారు. తాజాగా ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్‌కు చెందిన అణు సంబంధిత కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. అయితే ఈ వార్తలను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపించాయని ధ్వజమెత్తారు. వాటిని తిరిగి నిర్మించడం చాలా కష్టమైన పని.. కానీ ఫేక్ న్యూస్ మీడియా అమెరికా వైమానిక దళ సిబ్బందికి సరైన గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు.
గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం జూన్ 22న అమెరికా వైమానిక దళం, నౌకాదళం కలిసి ఇరాన్‌లోని అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్, నతాంజ్ అణు కేంద్రం, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకుని బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించారు. ఈ దాడులు 12 రోజుల యుద్ధంలో కీలక ఘట్టంగా నిలిచాయి. జూన్ 24న కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది.
Also Read
తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతమార్చాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు రేపటితో ముగుస్తోంది. అయితే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తొలి విడత చర్చలు ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. అయితే రెండో దఫా చర్చలు ఈరోజు జరగాల్సి ఉండగా ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే సోమవారం రాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా చర్చలకు వెళ్లాలని ఇరాన్ బృందానికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు. దీంతో చర్చలు జరుగుతాయా? లేదా ? అన్నది సందిగ్ధం నెలకొంది. లేదంటే మరోసారి పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మోడీ ‘ఝల్‌మురి’ వీడియో
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?