Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
- ట్రంప్-నెతన్యాహు విభేదాలు
- టర్కీకి F-35 యుద్ధ విమానాల అమ్మకంపై గుర్రు
- తిరస్కరించిన అధ్యక్షుడు ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. టర్కీకి అత్యాధునిక F-35 యుద్ధ విమానాల విక్రయం అంశంపై విభేదాలు బహిర్గతమైనట్లు సమాచారం. టర్కీకి F-35 యుద్ధ విమానాలను విక్రయించవద్దన్న నెతన్యాహు అభ్యంతరాలను ట్రంప్ తిరస్కరించారు. “అమెరికా ఏ దేశానికి ఏమి విక్రయించాలో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. టర్కీ నాకు గొప్ప మిత్రదేశం” అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
టర్కీపై ట్రంప్ ప్రశంసలు
టర్కీని ట్రంప్ శక్తివంతమైన దేశంగా అభివర్ణించారు. “టర్కీకి ఎంతో బలమైన సైన్యం ఉంది. వారి సైనిక సామర్థ్యం గొప్పది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు వారి దగ్గర ఉన్నాయి” అని చెప్పారు. అలాగే టర్కీకి ఇజ్రాయెల్ లేదా నెతన్యాహుపై ప్రత్యేక అనుకూలత లేకపోయినా, అమెరికాతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
నెతన్యాహూ అభ్యంతరం
ట్రంప్‌తో కీలక సమావేశాల కోసం సోమవారం వాషింగ్టన్ చేరుకున్న నెతన్యాహు.. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టర్కీకి F-35 యుద్ధ విమానాలు విక్రయించవద్దని ట్రంప్‌ను కోరినట్లు వెల్లడించారు. ‘‘F-35 ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానం. టర్కీ అమెరికాకు స్నేహపూర్వక దేశం కాదు. అలాంటి దేశానికి ఈ విమానాలను ఇవ్వడం సరైంది కాదు” అని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఆయన అమెరికాకు ఆదర్శ మిత్రుడు కాదు. నా దేశాన్ని, ప్రపంచంలో ఏకైక యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నారు” అని ఆరోపించారు. అలాగే టర్కీ ప్రభుత్వం ముస్లిం బ్రదర్హుడ్ ప్రభావంలో ఉందని, అది అమెరికా వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని కూడా నెతన్యాహు వ్యాఖ్యానించారు. టర్కీకి F-35 యుద్ధ విమానాలను విక్రయిస్తే మధ్యప్రాచ్యంలో శక్తి సమతుల్యత దెబ్బతింటుందని నెతన్యాహు హెచ్చరించారు. అందుకే ఈ ఒప్పందాన్ని ఆమోదించవద్దని ట్రంప్‌ను కోరినట్లు తెలిపారు.
ట్రంప్ ఏమన్నారు?
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం టర్కీపై గతంలో విధించిన పరిమితులను పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా నుంచి S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసిన కారణంగా టర్కీపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. F-35 యుద్ధ విమానాల విక్రయంపై స్పందిస్తూ ట్రంప్.. “ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానం. టర్కీకి విక్రయించే అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తాం” అని చెప్పారు.
టర్కీ ఆశలు
ఇక టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కూడా అమెరికాతో F-35 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే దశకు చేరుకున్నామని ఇటీవల వెల్లడించారు. అంతేకాకుండా, టర్కీ స్వదేశీ KAAN యుద్ధ విమాన ప్రాజెక్టు కోసం అమెరికా తయారీ ఇంజిన్లను కూడా పొందాలని టర్కీ ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!