US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్‌లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
- ఇరాన్ శాంతి ఒప్పందంపై అమెరికాలో అనుమానాలు..
- సీఐఏ నివేదికతో అలర్ట్ అయిన యూఎస్..
- ఒప్పందం విషయంలో ట్రంప్ వర్గంలో చీలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Peace Deal: కొన్ని నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. యూఎస్-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంలోనే చీలికలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్‌కు చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్లు సీఐఏతో పాటు ట్రంప్ టీమ్‌లోని కొందరు భావిస్తున్నారు. 2015లో ఇరాన్‌తో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం, ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్‌కు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ట్రంప్ రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మద్దతు ఇస్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వ్యతిరేకిస్తున్న వారిలో ఉన్నారు.
ఈ విషయాన్ని అమెరికన్ వెబ్సైట్ ఆక్సియోస్ ఒక నివేదికను ప్రచురించింది. ఇరాన్‌లోని సీఐఏ ఏజెంట్ల ద్వారా అందిన సమాచారంలో అమెరికా మరోసారి ద్రోహానికి గురవుతున్నట్లు సీఐఏ చెబుతోంది. అమెరికా కోరిన విధంగా ఇరాన్ అణు రాయితీలపై సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, ట్రంప్ ఇతర ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు అణు కార్యక్రమాలను ఇరాన్ నిలిపివేస్తుందనే విషయంలో సందేహాలు ఉన్నట్లు సీఐఏ, మార్కో రూబియో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు..
ఇరాన్ ఒప్పందంలో అత్యంత కీలకమైంది, “ఇది ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండదని, అత్యంత సుసంపన్నమైన యురేనియంను నిల్వ చేయలేదని, ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకోవద్దు’’ వీటిపై అమెరికాలోని ఒక వర్గం సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తదుపరి చర్యలపై చర్చించేందుకు జేడీ వాన్స్, విట్కాఫ్, కుష్నర్లు శుక్రవారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీలతో పాటు పాకిస్థాన్, ఖతార్‌ల మధ్యవర్తులతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!