గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత ఐదారు రోజులుగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో శనివారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. తులం బంగారం ధర రూ. 270 తగ్గింది. వెండి ధరలు కూడా ఉపశమనం కలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bus Accident: అంత్యక్రియల నుండి వస్తూ ఘోర ప్రమాదం.. 25 ప్రాణాలు బలి!
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 270 రూపాయలు తగ్గి.. రూ.1,03, 040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 250 రూపాయిలు తగ్గి.. తులం బంగారం ధర రూ. 94,450 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 10 గ్రాముల ధర రూ.77,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Netanyahu: గాజా స్వాధీనంపై నెతన్యాహు కీలక ట్వీట్.. ఈసారి ఏమన్నారంటే..!
వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కేజీ వెండి రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.