Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
- వైట్‌హౌస్ వేదికగా బిగ్ అనౌన్సె
- ఇంకా అధికారికంగా ధృవీకరించని ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని బిగ్ ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు న్యూక్లియర్ డస్ట్ (సుసంపన్న యురేనియం నిల్వ) మాకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు.’’ అని తెలిపారు. ఈ అంశంపై రెండు దేశాలు ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు.. ఒకవేళ ఒప్పందం ఇస్లామాబాద్‌లో జరిగితే పాకిస్థాన్‌కు కూడా వెళ్తానని ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
Also Read
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
- Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చ జరిగింది. అయితే చర్చలు ఫలించకపోవడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. యురేనియం శుద్ధిని 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఇరాన్ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అంగీకరిస్తామని తెగేసి చెప్పింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా నిర్దేశించిన “రెడ్ లైన్స్” పాటిస్తే ఈ ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని.. అంతే తప్ప అణు ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..
అయితే రెండో విడత చర్చల కోసం వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ ఒప్పించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి టెహ్రాన్‌లో కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. గురువారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిభాఫ్తో సమావేశమై శాంతి చర్చలపై చర్చించారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకారం.. అసిమ్ మునీర్.. రివల్యూషనరీ గార్డ్స్ కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి ఇరాన్ కమాండర్లతో కీలక అంశాలపై చర్చించారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇతర నాయకులతో కూడా సమావేశమయ్యారు. అయితే రెండో విడత చర్చలపై మాత్రం ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!