LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..
- కొత్తగా రెండు యాప్‌ల ఆవిష్కరణ..
- వినియోగదారుల కోసం మై ఎల్ఐసీ యాప్..
- ఏజెంట్ల కోసం సూపర్ సేల్స్ సాథీ యాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన వినియోగదారులకు, ఏజెంట్లకు అత్యాధునిక డిజిటల్ అనుభవాన్ని అందించడానికి ‘MyLIC’ , ‘Super Sales Saathi’ అనే రెండు కొత్త మొబైల్ అప్లికేషన్లను ప్రారంభించింది. ఈ అప్డేట్ ద్వారా ఎల్ఐసీ తన సేవలను మరింత వేగంగా.. పారదర్శకంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త యాప్‌ల ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
1. MyLIC యాప్ (వినియోగదారుల కోసం)
Also Read
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
- Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
పాలసీదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా కస్టమర్లు కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని సేవలు పొందవచ్చు. మీ పేరు మీద ఉన్న అన్ని పాలసీలను ఒకే చోట చూసుకోవచ్చు. వెంటనే ఆన్లైన్ ద్వారా ప్రీమియంలు చెల్లించే సదుపాయం ఉంది. పాలసీపై రుణం కావాలంటే ఎటువంటి కాగితపు పని లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగిపోయిన (Lapsed) పాలసీలను మళ్లీ యాక్టివేట్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులభం అవుతుంది. ఈ కేవైసీ ప్రక్రియను కూడా దీనిలో సులువుగా చేసుకోవచ్చు. నేరుగా యాప్ నుంచే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.
Also Read:EPFO: పీఎఫ్ డ్రా చేసేవారికి బిగ్ అప్డేట్.. 15G-15H స్థానంలో ఫారం 121.. ఎలా ఉపయోగించాలి?
2. Super Sales Saathi యాప్ (ఏజెంట్ల కోసం)
ఇది ఎల్ఐసీ ఏజెంట్లు , సేల్స్ టీమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫారమ్. ఇది వారి పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. కస్టమర్లకు పాలసీ వివరాలను వివరించడానికి డిజిటల్ కిట్స్ , ప్రెజెంటేషన్లు అందుబాటులో ఉంటాయి. పాలసీల స్టేటస్ , క్లెయిమ్ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. కస్టమర్లకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి , తదుపరి ఫాలో-అప్ల కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత నోటిఫికేషన్లు అందుతాయి. ఏజెంట్లు తమ లక్ష్యాలను (Targets), సాధించిన పురోగతిని సులభంగా చూసుకోవచ్చు.
ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఈ ‘DIVE’ (Digital Innovation and Value Enhancement) ప్లాట్‌ఫారమ్ ద్వారా బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇది సేవలను సులభతరం చేయడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసేలా కాగిత రహిత (Paperless) విధానాన్ని ప్రోత్సహిస్తోంది. కస్టమర్లు, ఏజెంట్లు ఇద్దరికీ ఇది ఒక సమగ్ర డిజిటల్ పరిష్కారంగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!