Donald Trump: ఇండియా-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అవే కామెంట్స్.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్!
- భారత్- పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపేశాను..
- యుద్ధాలన్నీ తానే ఆపానంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత్- పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి ఇవే కామెంట్స్ చేశారు. బుధవారం నాడు నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో పాల్గొన్న ట్రంప్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలన్నీ తానే ఆపానంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు.
Read Also: Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
ఇక, ఇరాన్- ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ల యుద్ధాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ట్రంప్.. ఈ సందర్భంగా.. నేను జోక్యం చేసుకోవడంతోనే భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గిపోయాయని తెలిపారు. ఇరు దేశాలకు నేతలకు నేను వరుస ఫోన్ కాల్స్ చేయడంతోనే యుద్ధం ముగించారు అని పేర్కొన్నారు. మీరు ఒకరితో ఒకరు పోరాడితే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని వారికి చెప్పాం.. భారత ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు .. పాక్ జనరల్ అసిఫ్ మునీర్ ఆకట్టుకునే వ్యక్తి.. వారు కూడా వాణిజ్య ఒప్పందమే కావాలని చెప్పుకొచ్చారు.. అలా మేమే ఆ అణు యుద్ధాన్ని ఆపేశామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ పై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ట్రంప్ మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్. దీనికి మే 10వ తేదీ నుంచి ట్రంప్ ఇలా చెప్పడం 16వ సారి అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే, హస్తం పార్టీ నేత పవన్ ఖేరా కూడా.. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని భారత ప్రయోజనాలను తుంగలో తొక్కారని కామెంట్స్ చేశారు. కాగా, భారత్, పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మోడీ ఇటీవల చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. ఇందులో ఏ దేశం కూడా మధ్యవర్తిగా వ్యవహరించ లేరని తెలిపారు. ఈ విషయాన్ని తాను స్వయంగా ట్రంప్ కి ఫోన్లో చెప్పానని ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!