Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్‌కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో హమాస్‌కి మద్దతుగా, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రస్తుతం, ప్రభుత్వం ప్రతిపాదించిన డిమాండ్లకు యూనివర్సిటీ ఒప్పుకోకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ‘‘మేము హార్వర్డ్ యొక్క పన్ను మినహాయింపు స్థితిని తీసివేయబోతున్నాము. దీనికి వారు అర్హలు’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే, హార్వర్డ్ 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్ల నిలుపుదలను ఎదుర్కొంటోంది, యూనివర్సిటీ డిమాండ్లను పాటించడానికి నిరాకరించిన ఈ సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
Read Also: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
ట్రంప్ పరిపాలన యూనివర్సిటీల్లో ప్రవేశ విధానాల మార్పుకు పిలుపునివ్వడంతో పాటు, విస్తృత ప్రభుత్వ, నాయకత్వ సంస్కరణలుకు పిలుపునిచ్చింది. క్యాంపస్‌లో వైవిధ్యంపై ఆడిట్ చేయాలని, కొన్ని విద్యార్థి సంఘాలను గుర్తించడం ఆపేయాలని ట్రంప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. యూనివర్సిటీ ఈ డిమాండ్లను తిరస్కరించింది. ప్రభుత్వ డిమాండ్లకు తాము లొంగబోమని ప్రకటించింది. హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ మాట్లాడుతూ..యూనివర్సిటీ తన స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగ హక్కుల్ని వదులుకోదని ప్రకటించారు.
ఏప్రిల్ 29న హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ లా రివ్యూపై ఫెడరల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. జర్నల్ కార్యకలాపాల్లో జాతి ఆధారిత వివక్ష ఉన్నట్లు అధికారులకు నివేదికలు అందాయని పేర్కొంది. ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తూ, యూనివర్సిటీ పన్ను మినహాయింపు హోదాను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. హార్వర్డ్ ఒక అవమానకరమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.