Site icon NTV Telugu

Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట

Trump

Trump

ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెబుతూనే ఉంటోంది. కానీ ట్రంప్ మాత్రం లేదు.. లేదు యుద్ధాన్ని ఆపింది తానేనంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా మరోసారి వైట్‌హౌస్ వేదికగా మంగళవారం అవే వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్

మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తిరిగి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ప్రధాని మోడీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారు. ‘‘ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు జరుగుతుందని మోడీని అడిగాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్‌, పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ సుంకాలతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. కానీ ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: టారిఫ్ ఉద్రిక్తతలు.. ట్రంప్ ఫోన్ కాల్స్ పట్టించుకోని మోడీ.. ఎన్ని సార్లు చేశారంటే..!

ట్రంప్ ప్రకటనలను భారత్ పదే పదే ఖండిస్తోంది. అయినా కూడా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు చెప్పింది. కానీ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంటుంది.

ఇదిలా ఉంటే బుధవారం భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. ఈ సుంకాలు కారణంగా అమెరికాతో దాదాపు సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యా, చైనాతో భారత్ సంబంధాలు పెంచుకుంటోంది. చైనాతో సంబంధాలు బలపడితే భారత్ ఆర్థికంగా పుంజుకోవచ్చని తెలుస్తోంది.

 

Exit mobile version