Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ముగిపోవడంతో.. ఆయనకు పదవీ గండం తప్పేలా లేదు. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ నెలాఖరులో.. ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఆయన పాలన పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని.. దేశంలో నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం పెరిగి పోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Ukraine Russia War: రష్యా దాడుల్లో హీరోయిన్ మృతి..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
అయితే, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ నెగ్గడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ పార్లమెంట్లో.. 172 మంది ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక సైన్యంకూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పైనా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇంకోవైపు… ఈ నెల 29 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు బస చేసే హోటల్‌కు సమీపంలోనే ఆ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో సిరీస్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యకమౌతున్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో సిరీస్ వేదికను ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు మార్చే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు-పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!