Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.