హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్ర నాయకులందరినీ హతమార్చింది. తాజాగా ప్రస్తుత హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ను కూడా చంపేసినట్లుగా బుధవారం అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు
హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులకు ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్‌ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Israel: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ఈ రోజు చెప్పింది. బీరూట్‌లో జరిగిన దాడిలో అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయిల్ హై అలర్ట్‌లోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో.. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ చావు దెబ్బ తీసింది. బీరూట్‌పై జరిగిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ IDF సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
Hassan Nasrallah: హిజ్బుల్లాను చావు దెబ్బ తీసింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌పై జరిగిన వైమానికి దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఈ రోజు తెలిపింది.
ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. ఉత్తర సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు మోహరించాయి. దీంతో.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడి చేయబోతున్నట్లు భావిస్తున్నారు.
Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
Israeli Attack : రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... భూమి దాడికి ముందు దక్షిణ గాజా నగరం నుండి వేలాది మంది ప్రజలను తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని కోరినట్లు చెప్పారు.