Pakistan: భారత్‌పై పగతో పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్‌ను మింగేస్తుంది! వారంలోనే 50 మంది పాక్ సైనికులు ఖతం..
- పాకిస్థాన్‌లో 'ఉగ్ర' మారణహోమం
- వణికిపోతున్న సరిహద్దు దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఒకప్పుడు భారత్‌పై తీవ్రమైన పగతో ఎలాగైనా మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని పాముకు పాలు పోసి పెంచినట్లు పాకిస్థాన్ ఉగ్రవాదం అనే పెను భూతాన్ని చేరదీసి పెంచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే పాకిస్థాన్‌ను ఉగ్రవాదం కోరలు చాచి మింగేస్తోంది. అందుకే పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు.. కర్మ అనేది ఒకటి ఉంది.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరనేది నిజం అనే వాళ్ల మాటలు పాక్ పరిస్థితిని చూస్తే అక్షరాల వాస్తవం అని అర్థం అవుతుంది. గత వారం రోజులుగా ఆ దేశంలో భద్రతా దళాలే లక్ష్యంగా జరిగిన వరుస దాడులు అక్కడి రక్షణ వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశాయి. జూలై 1 నుంచి జూలై 7 మధ్య కేవలం ఏడు రోజుల్లోనే వివిధ ప్రావిన్సులలో జరిగిన చిన్న, పెద్ద దాడుల్లో 50 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది. మిలిటరీ స్థావరాలు, పోలీస్ పోస్టులు, కోస్ట్ గార్డ్ క్యాంపులపై ఉగ్రవాదులు తెగబడి దాడులు చేయడంతో పాక్ ప్రభుత్వం, సైన్యం వణికిపోతున్నాయి. ఇదే సమయంలో ఆ దేశ సైనిక అధికారులు అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వారం రోజుల్లో జరిగిన భయానక దాడులు ఇవే..
* జూలై 1 (ఖైబర్ పఖ్తూన్ఖ్వా): కోహట్-హంగూ రహదారిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు.
Also Read
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
* జూలై 2 (బజౌర్ & మహమ్మద్ జిల్లా): బజౌర్ ప్రాంతంలో ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) సైనికుడు, అలాగే మహమ్మద్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
* జూలై 3 (గ్వాదర్ పోర్ట్ – భారీ ఆత్మాహుతి దాడి): బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్ సమీపంలో ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ క్యాంపుపై బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత ఘోరమైన ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును నేరుగా క్యాంపులోకి దూకించి పేల్చివేయడంతో.. 30 మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
* జూలై 5 (ఇస్లామాబాద్ – సర్జికల్ స్ట్రైక్): సాక్షాత్తూ రాజధాని ఇస్లామాబాద్‌లోనే ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్‌కు పాల్పడ్డారు. ఈ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతమవ్వడం అక్కడి రక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) అధికారికంగా ప్రకటించింది.
* జూలై 7 (బలూచిస్థాన్): జియారత్ జిల్లాలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడిలో 16 మంది పోలీసులు మరణించారు.
ఉగ్ర నీడలో పాక్ భద్రత..
భద్రతా దళాలపై వరుసగా జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు ఎంత దారుణంగా క్షీణించాయో స్పష్టం చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 2024 ఏడాదిలోనే పాకిస్థాన్‌లో రికార్డు స్థాయిలో 1,099 ఉగ్రవాద దాడులు నమోదు కాగా.. ప్రస్తుత 2025-2026 నాటికి ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరిగిపోతోందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. నాడు ఇతర దేశాలను దెబ్బతీయడానికి పెంచి పోషించిన ఉగ్రవాద భస్మాసురుడే.. నేడు సొంత సైన్యాన్ని కాటేస్తూ పాకిస్తాన్‌ను సర్వనాశనం చేస్తున్నాడని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!