ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేయడంతో ఇరాన్‌లో భారీ నష్టం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Prabhas : రాజాసాబ్ టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
ఇక ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో తమను తీసుకెళ్లిపోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనపై ఇరాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థుల తరలింపునకు సహకరించాలని ఇరాన్‌ను భారతీయ ఎంబసీ కోరింది. అయితే ప్రస్తుతం ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. దీంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!
తాజాగా భారత అభ్యర్థనపై ఇరాన్ అధికారులు స్పందించారు. విమాన రాకపోకలు నిలిపివేసిన కారణాన భూసరిహద్దులు తెరిచి ఉన్నాయని.. ఆ దిశగా తీసుకెళ్లాలని ఇరాన్ సూచించింది. ఈ మేరకు టెహ్రాన్ అధికారులు వెల్లడించారు. సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్ నంబర్లు, వాహన వివరాలను జనరల్ ప్రొటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారతదేశాన్ని కోరింది. దౌత్యవేత్తలు, ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. దాదాపు ఇరాన్‌లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు.
టెహ్రాన్ సూచన మేరకు భారతీయ విద్యార్థులను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని భారత్ పేర్కొంది. ఇక ఇరాన్ నగరాల్లో చిక్కుకున్న వారు భయపడవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది.