ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు.
కాగా కొద్దీ సేపటి క్రితం రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. వాస్తవానికి మారుతీతో సినిమా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కాని ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూసాక ఇది కదా మేము డార్లింగ్ నుండి ఎదురుచూసేది అని మారుతీని ఓ రేంజ్ లో పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ లో వింటేజ్ లుక్ ప్రభాస్ అదరగొట్టాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి. చివర్లో డార్లింగ్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. ఏదేమైనా చాలా కాలంగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. రెండు తెలుగు రాష్టాల్లోని కసెలెక్టీవ్ థియేటర్స్ లో రాజాసాబ్ టీజర్ ను అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేసారు మేకర్స్. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన రాజాసాబ్ ను ఓ సారి చూసేయండి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Also Read : Ayesha Khan : చీరలో నాజూకైన ఒంపు సొంపులతో అదరగొడుతున్నఆయేషా ఖాన్