DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్‌కు హైపర్సోనిక్ వెర్షన్.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి…