Tax On Cows Burps And Farts in New Zealand: న్యూజిలాండ్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. వాతావరణ మార్పులకు ఆవుల నుంచి వచ్చే గ్యాస్, త్రేన్పులు కూడా కారణం అవుతున్నాయి. అయితే వ్యవసాయ జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌజ్ వాయువుపై కూడా పన్నులను విధించాలని న్యూజిలాండ్ ప్రతిపాదించింది. ఆవులు కడుపు నుంచి వచ్చే గ్యాసు కోసం రైతులపై పన్ను విధించాలని భావిస్తోంది. ఇలాగా పన్నులు వసూలు చేయడం ఇదే మొదటిసారి.
ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాతావరణ మార్పు ప్రతిపాదన.. దేశంలో పెరుగుతున్న వ్యవసాయ పరిశ్రమ నుంచి వచ్చే గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు రైతులు తమ పశువుల ఉద్గారాలకు పన్నులు చెల్లించే ప్రతిపాదనను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2025 నాటికి వ్యవసాయ ఉద్గారాలను తగ్గిస్తామని ఆమె వాగ్థానం చేశారు.
Read Also: Karnataka Hijab Ban: హిజాబ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం
న్యూజిలాండ్ లోని 60.2 లక్షల ఆవులు సహజంగా గ్రీన్ హౌజ్ వాయువులతో పాటు పశువుల మూత్రం నుంచి నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతుంది. ఆవులు నుంచి వెలువడే గ్యాస్ నుంచి మీథేన్ వాయువు విడుదల అవుతుంది. ఇవి గ్రీన్ హౌజ్ ఎఫెక్టుకు తోడ్పడుతున్నాయి. దీంతో రైతులపై అక్కడి ప్రభుత్వం పన్నులు వేయాలని చూస్తోంది. ఆవుల మంద పరిమాణాన్ని బట్టి రైతులు టాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించే పన్నులతో పరిశోధనలు, కొత్త సాంకేతికత, వాతావరణ అనుకూల పద్ధతులను అనుసరించే రైతులకు రాయితీగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.