Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schengen Visa: జర్మనీకి చెందిన షెంజెన్ వీసా ప్రక్రియను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించినట్టు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇండియా నుంచి యూరప్ ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ పర్యాటకుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసా ప్రక్రియ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్‌వైలర్ తెలిపారు. గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీసా ఒక ముఖ్యమైన అంశమని.. దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నామని.. ముంబయిలో వీసా జారీకి సిబ్బంది సంఖ్యను పెంచినట్టు తెలిపారు. సిబ్బంది పెంపుతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని జార్జ్ చెప్పారు.
Read also: Andhrapradesh: విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. 8 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకారం
Also Read
షెంజెన్ వీసాను విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి ఇస్తారు. ఈ వీసాతో గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలను ఎక్కువగా జారీ చేస్తారు. ఈ వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఇటీవలి కాలంలో భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో షెంజెన్ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జర్మన్ రాయబార కార్యాలయం నిర్ణయించింది. జర్మన్ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉన్నట్టు వారు గుర్తించారు. షెంజెన్ వీసాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో అపాయింట్‌మెంట్, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్‌లో జర్మన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్‌టర్నల్ సర్వీస్ ప్రొవైడర్(వీఎఫ్‌ఎస్)తో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొంది. ఇది పూర్తయి కాన్సులేట్ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే వీసా జారీ ప్రక్రియ కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం ప్రకటించింది. పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడం కోసం జర్మన్ షెంజెన్ వీసా ప్రక్రియను వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!