France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
స్విట్జర్లాండ్ వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. భారత్ లోని స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.