Solar Cycle: సూర్యుడు ప్రస్తుతం తన 25వ ‘సోలార్ సైకిల్’(సౌర చక్రం)లో ఉన్నాడు. 11 ఏళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ప్రస్తుతం సగం కాలం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్టానికి చేరుకుంది.
Isro: ఇటీవల సూర్యుడి నుంచి వెలువడని కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) వల్ల శక్తివంతమైన సౌర తుఫాను ఏర్పడింది. ఇది భూమిపై ‘భూఅయస్కాంత తుఫాను’ను ప్రేరేపించింది.
Geomagnetic Storm: సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతిపెద్ద ‘‘భూ అయస్కాంత తుఫాను’’గా శాస్త్రవేత్తలు దీనిని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాన్ ఆదివారం భూ వాతావరణాన్ని ఢీకొట్టింది. భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగించింది. NOAA యొక్క స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Solar flare: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడిపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 2025లో గరిష్ట సన్‌స్పాట్ యాక్టివిటీ పెరుగుతుందని అంచనా. సూర్యుడి సౌరచక్రంలో తన అయస్కాంత ధృవాలను మార్చుకుంటాడు. దీంతో ఉపరితలంపై సన్‌స్పాట్‌లు ఎక్కువగా ఏర్పడటంతో పాటు సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ పెరుగుతున్నాయి. భారీ సౌర విస్పోటనాలు జరుగుతున్నాయి.
The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది.
Solar Maximum: సూర్యుడు ఊహించిన దానికన్నా ముందు ‘‘సోలార్ మాగ్జిమమ్’’ దశకు చేరుకుంటున్నాడని శాస్త్రవేత్తులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో సూర్యుడిపై భారీగా మరిన్ని విస్పోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 23 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇవి భూమిని చేరుకుని ‘భూ అయస్కాంత తుఫాను’లకు కారణం అయ్యాయి. గత నెలలో సూర్యుడిపై మూడు భారీ విస్పోటనాలు సంభవించాయి.
Plasma Waterfall: సూర్యుడు ప్రస్తుత తన 11 ఏళ్ల ‘‘సోలార్ సైకిల్’’ దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సౌర జ్వాలలు, బ్లాక్ స్పాట్స్ వంటివి ఇటీవల కాలంలో ఏర్పడటం గమనించాం. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి ధ్రువాలు మారుతుంటాయి.
Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి.
A huge explosion on the sun: సూర్యుడిపై ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సౌర విస్పోటనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) వెలువడుతున్నాయి. మంగళవారం సూర్యుడిపై భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సూర్యుడి ఉపరితలం నుంచి 2 లక్షల కిలోమీటర్ మేర సౌరజ్వాల ఎగిసిపడింది. పేలుడు నుంచి వెలువడిని సౌరజ్వాల భూమి వైపుగా రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Sun Is Angry: సూర్యుడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత రెండు వారాల్లో సూర్యుడిపై 36 భారీ విస్పోటనాలు ( కరోనల్ మాస్ ఎజెక్షన్స్), 14 సన్ స్పాట్స్, 6 సౌర జ్వాలలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని భూమిని నేరుగా తాకగా.. మరికొన్ని భూమికి దూరంగా వెళ్లాయి. భూమిపైన సమస్త జీవరాశికి, సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలకు శక్తినిచ్చే సూర్యుడు.. ఇటీవల కాలంలో భారీ స్థాయిలో శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి…