Srilanka Crisis: ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు రెండు వారాల పాటు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.
ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. శ్రీలంక అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డిజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో సోమవారం నుంచి అన్ని విభాగాలు, ప్రభుత్వ సంస్థలు తమ సేవలను తక్కువ చేసుకోవాలని అక్కడి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
1948లో బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు ఇలా అన్నింటిలో తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు గోటబయ రాజపక్స, కొత్తగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించడంతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. అయినా ఇప్పటికిప్పుడు శ్రీలంక పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ఇక ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్ క్రెడిట్ లైన్ కింద మందులు, ఇంధనం, ఎరువులు, ఆహారాన్ని శ్రీలంకకు అందిస్తోంది. ఇటీవల భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా పొగిడింది. శ్రీలంకలో పరిస్థితి ఇలా కావడానికి గోటబయ కుటుంబీకులే కారణం అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..