శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది.…