Srilanka Crisis: మరోసారి రణరంగంగా మారిన శ్రీలంక.. పారిపోయిన అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక మరోసారి రణరంగంగా మారింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో ఆందోళనకారులపై శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సైన్యం లాఠీఛార్జీకి దిగింది. ఈ ఘటనలో 26 మంది గాయాలైనట్లు సమాచారం. నలుగురు జవాన్లకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
Shinzo Abe: షింజో అబేను అందుకే కాల్చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్ని కూడా అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాలకు అస్సలు ఇంధనాన్ని కేటాయించడం లేదు. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యా వ్యవస్థపై పడింది. జూలై 4వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులు వారం పాటు కొనసాగుతాయని శ్రీలంక విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ వారం రోజుల్లో పిల్లలు కోల్పోయిన సిలబస్ వచ్చే వారం క్లాసుల్లో కవర్ అవుతాయని అన్నారు. కాగా అంతకు ముందు కూడా జూన్ 18వ తేదీన శ్రీలంక ప్రభుత్వం వారం రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవులు ముగిసిపోయి పాఠశాలలు తెరవగా.. మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తాయి.
శ్రీలంకలో తాజా పరిస్థితిపై అత్యవసర పార్లమెంట్ ఏర్పాటుకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి ప్రతిపక్ష నేతలందరు పార్లమెంటుకు రావాలని ప్రధాని రణిల్ విక్రమసింఘే కోరారు. దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై పార్లమెంట్‌లో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..