ఆస్ట్రేలియాలో స్కైడైవర్లో అపశృతి చోటుచేసుకుంది. విమానం నుంచి దూకి స్కైడ్రైవర్కు ప్రయత్నిస్తుండగా పారాచూట్ విమానం తోకకు చిక్కుకుంది. సెప్టెంబర్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్కైడైవర్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇది కూడా చదవండి: Bangladesh: రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్! కారణమిదే!
గురువారం ఆస్ట్రేలియా అధికారులు వీడియో విడుదల చేశారు. రవాణా భద్రతా వాచ్డాగ్ దర్యాప్తు తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు. విమానం వేల మీటర్ల ఎత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని.. విమానం తోకకు పారాచూట్ చిక్కుకోవడంతో స్కైడైవర్ గాల్లో వేలాడుతూ కనిపించాడు. దాదాపు 15,000 అడుగుల (4,600 మీటర్లు) ఎత్తులో పారాచూట్ చిక్కుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఈ ఘటన జరిగినట్లుగా కనిపెట్టారు. మొత్తానికి స్కైడైవర్ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ సంఘటన తర్వాత విమానం తోక భాగం దెబ్బతింది. అంతేకాకుండా పైలట్ కూడా విమానంపై నియంత్రణ కోల్పోయినట్లుగా తెలిసింది. మొత్తానికి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో స్కైడైవర్ కాళ్లకు దెబ్బలు తగిలినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Sivaraj Patel: కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత