బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తరుణంలో మరో రాజకీయ ఉద్రిక్తత నెలకొనబోతుంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యూనస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో షహబుద్దీన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజీనామా చేయాలని షహబుద్దీన్ ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికలు ముగిశాక రాజీనామా చేస్తానని అంతర్జాతీయ మీడియాతో అన్నారు.

2026, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షహబుద్దీన్ మాట్లాడుతూ… యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం తనను అవమానిస్తోందని వాపోయారు. అందుకే రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల వరకు ఉంటానని.. ఈ తర్వాత తప్పుకుంటానని పేర్కొన్నారు. యూనస్ దాదాపు 7 నెలల నుంచి తనను కలవలేదని.. ప్రెస్ డిపార్ట్‌మెంట్‌ను కూడా తొలగించారని ఆరోపించారు. సెప్టెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల నుంచి తన కూడా ఫొటోలు కూడా తీసేశారని పేర్కొన్నారు. దీంతో అధ్యక్షుడు తొలగింప బడుతున్నట్లుగా ప్రజలకు సందేశం వెళ్లిందన్నారు. దీన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఫొటోలు ఎందుకు తొలగించారని లేఖ రాస్తే.. ఇప్పటి వరకు యూనస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఇది కూడా చదవండి: Zelenskiy: రష్యాతో శాంతి ఒప్పందానికి అమెరికా ఒత్తిడి.. జెలెన్‌స్కీ కొత్త ప్లాన్ ఇదే!
2024లో విద్యార్థుల ఆందోళనతో బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చేశారు. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇన్నాళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 300 పార్లమెంటరీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Sivaraj Patel: కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత