Israel-Hamas War: ఆరని యుద్ధ జ్వాలా.. హమాస్ సీనియర్ నాయకుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ప్రారంభమై ఇప్పటికే నెల పది రోజులు కావొస్తుంది. అయినా నేటికీ యుద్ధ కీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల పోరులో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా హమాస్ కి చెందిన సీనియర్ నేత కూడా మరణించారని హమాస్ పేర్కొంది.. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అహ్మద్ బహర్ మరణించినట్లు పాలస్తీనా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (హమాస్) ధృవీకరించింది. ఈ నేపథ్యంలో హమాస్ అధికారులు మాట్లాడుతూ.. శనివారం ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడుల్లో అహ్మద్ బహర్ గాయపడ్డారని.. ఆ తరువాత ఆ గాయాల కారణంగా మరణించాడని పేర్కొన్నారు.
Read also:Telangana Elections 2023: బాబు మోహన్‌కి షాక్ ఇచ్చిన తనయుడు!
Also Read
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
కాగా ఇతను 2006లో పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచినప్పటి నుంచి పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ తాత్కాలిక స్పీకర్‌గా పనిచేశారు. అలానే గతంలో బహార్ షురా కౌన్సిల్ అధిపతితో సహా అనేక ఇతర సీనియర్ హమాస్ పదవులను కూడా నిర్వహించారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసి చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు విచక్షణారహితంగా చంపేసింది. ఈ నేపథ్యంలో హమాస్ ను నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే నాటి నుండి నేటి వరకు హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుపుతుంది. కాగా హమాస్ మాత్రం ప్రజలను అడ్డం పెట్టుకుని యుద్ధం చెయ్యాలి చూస్తూ అమాయక ప్రజల మరణాలకు కారణం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Meenakshi Seshadri: ‘ఏ పాత్రైనా ఓకే.. ఒక్క ఛన్స్ ఇవ్వండి..‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
-
Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
-
Eggs in Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!
-
Rohit Sharma: రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. మే 25న ఆ అవార్డును ఎందుకు అందుకోలేదు?
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!