రెండు సంవత్సరాల కొవిడ్ పరిస్థితుల తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సమర్‌కండ్ చేరుకున్నారు.
షాంఘై సహకార సంస్థ(SCO) సభ్యదేశాల 22వ శిఖరాగ్ర సదస్సు గురువారం ఉజ్బెకిస్తాన్‌లోని చారిత్రక నగరం సమర్‌కండ్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేడు,రేపు రెండు రోజుల పాటు జరగనుంది.