Scientist Claims Mystery Behind Sheep Walking In Circle In China Solved: ఇటీవల ఇంటర్నెట్ లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. చైనాలో ఓ గొర్రెల మంద అదేపనిగా వృత్తాకారంలో తిరగడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియో చాలా మందిని కలవరపాటుకు గురిచేసింది. వరసగా 12 రోజుల పాటు పెద్ద గొర్రెల మంద సర్కిల్ ఆకారంలో ఒకదాని వెనక ఒకటి తిరుగుతున్న వీడియో ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఫుటేజీని చైనీస్ ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీ పోస్ట్ చేసింది. ఇన్నర్ మంగోలియా ప్రాంతంతో ఒక పొలంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. డజన్లకు పైగా గొర్రెలు అపసవ్య దిశలో వృత్తాకారంలో తిరగడం గమనించవచ్చు.
Read Also: Vodafone Idea: భారీగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా
అయితే ఈ ఘటనపై ఇంగ్లాండ్‌లోని గ్లౌసెస్టర్‌లోని హార్ట్‌పురీ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ విభాగంలో ప్రొఫెసర్ డైరెక్టర్ మాట్ బెల్ స్టడీ చేశారు. గొర్రెలు చాలా కాలం వరకు ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల వాటిల్లో మంద బుద్ది ఏర్పడినట్లు తెలుస్తోందని అన్నారు. ఒకే ప్రాంతంలోొ ఎక్కువ రోజులు ఉండటం వల్ల గొర్రెలు ఇలా ప్రవర్తించి ఉండవచ్చని ఆయన వివరించారు. నిరాశ కారణంగా ఇలా చుట్టు తిరగడం ప్రారంభించాయిని.. ఇలా చేస్తున్న గొర్రెల వెనకాల ఇతర గొర్రెలు కూడా తిరిగాయని ఆయన అన్నారు. గొర్రెలు మంద మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాయని.. అవి మందతో పాటే కదులుతాయని ఆయన అన్నారు.
నవంబర్ 4న గొర్రెలు వృత్తాకారంలో నడవడం ప్రారంభించాయని పీపుల్స్ డైరీ పేర్కొంది. మియావోొ అనే రైతుకు చెందిన గొర్రెల మందగా గుర్తించారు. ఆయనకు మొత్తం ఉన్న గొర్రెలను 34 దొడ్లతో ఉంచుతున్నారు. అయితే ఒక్క దొడ్లోనే ఇలా గొర్రెలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక్కో దొడ్డిలో ఒకటి లేదా రెండు గొర్రెలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తాయని.. మందంతా ఇలా వృత్తాకారంలో తిరగడం చాలా అరుదని ఆయన అన్నారు.
A flock of Sheep in Inner Mongolia have been walking in a circle for over 10 days straight and no one knows why.
pic.twitter.com/Hy3GFnjRm5— Billy (@Billyhottakes) November 17, 2022