ఇటీవలే పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడు సత్తాచాటారు. పెరూ దేశంలో ఓ మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఆధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి అధ్యక్షపీఠాన్ని కైవసం చేసుకోవడంతో ప్రపంచం దృష్టి మొత్తం పెరూ వైపు చూసింది. గత నెల 6 వ తేదీన పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 51 ఏళ్ల పెడ్రో కాస్టిలో విజయం సాధించారు. ఈయన పాపులర్ పార్టీకి చెందిన కైకో పుజిమోరిని 44 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల తరువాత ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కౌంటింగ్ నిర్వహించారు. మారథాన్ కౌంటింగ్ తరువాత పెడ్రో కాస్టిలో గెలుపొందినట్టు పెరూ ఎన్నికల కమీషన్ అథారిటి అధికారికంగా ప్రకటించింది.
Read: “ఆర్ఆర్ఆర్” టీంలో చేరిన అలియా