Saudi Arabia: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు.. యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ..
- క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు..
- యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ చేశాడన్న మాజీ అధికారి..
- ప్రవాసంలో జీవిస్తున్న సౌదీ మాజీ అధికారి అల్-జబ్రీ..
- తనను చంపేందుకు యత్నిస్తున్నాడని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ మాజీ అధికారి సాద్ అల్-జబ్రీ ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు. అతడిని ‘‘పరువు లేని మాజీ అధికారి’’గా సౌదీ అభివర్ణించింది. కెనడాలో ప్రవాసంలో జీవిస్తున్న అల్-జబ్రీని సౌదీ అరేబియాకి తిరిగి రప్పించేందుకు అతడిన ఇద్దరు పిల్లలను జైలులో ఉంచడంపై అనేక ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది.
Read Also: Murder : జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
ప్రస్తుతం ప్రిన్స్ ఎంబీఎస్ తన తండ్రి 88 ఏళ్ల రాజు సల్మాన్ స్థానంలో వాస్తవ పాలకుడిగా పనిచేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఎంబీఎస్ అధికారం అధిరోహించే ప్రారంభ సమయంలో, అతనిపై ఉన్న అసమ్మతిని విస్తృతంగా అణిచివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన నమ్మదగిన అధికారి తెలిపిన దాని ప్రకారం.. తన తండ్రి స్థానంలో యుద్ధం ప్రకటిస్తూ ప్రిన్స్ ఎంబీఎస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినట్లు అల్-జబ్రీ ఆరోపించారు. యెమెన్‌పై భూతల దాడికి సంబంధించి రాయల్ డిక్రీ ఉన్నట్లు తెలిపారు. ‘‘రాజాజ్ఞ కోసం అతను తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. రాజు మానసిక సామర్థ్యం క్షీణిస్తోంది’’ అన్నారు.
ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యెమెన్‌పై యుద్ధం జరిగింది. దాదాపు ఒక దశాబ్ధం పాటు ఇది కొనసాగింది. యుద్ధంలో 1,50,000 కంటే ఎక్కువ మంది మరణించారు. ప్రపంచంలో ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. యుద్ధ సమయంలో ఎంబీఎస్ రక్షణ మంత్రిగా ఉన్నారు. అల్-జబ్రీ సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాత సౌదీలో అల్-ఖైదా మిలిటెంట్లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో యుఎస్‌కి నమ్మకస్తుడైన మాజీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయేఫ్ కోసం పనిచేశాడు. కింగ్ సల్మాన్ 2017లో తన కుమారుడు ఎంబీఎస్ని క్రౌన్ ప్రిన్స్ హోదాలోకి తీసుకువచ్చాడు. ఎంబీఎస్ తనను చంపాలని చూస్తున్నాడని అల్-జబ్రీ ఆరోపించారు. నేను చనిపోయే వరకు అతను విశ్రమించడని ఆయన పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!