PAK Beggars: బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్.. 5 వేల మందిని వెనక్కి పంపిన సౌదీ..
- బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్..
- పాక్ బిచ్చగాళ్లను బలవంతంగా పంపించిన సౌదీ అరేబియా..
- బిచ్చగాళ్ల తరిమివేతపై నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాక్ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా అపకీర్తిని సొంతం చేసుకుంది. అయితే, తాజాగా సౌదీ అరేబియాలో పాక్ కు చెందిన 5,033 మంది బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా తిరిగి పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించేసింది. ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించినట్లు డాన్ పత్రిక కథనంలో రాసుకొచ్చింది.
Also Read
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ఇక, 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను ఇప్పటి వరకు 5,402కు చేరుతుంది. వీరిని సాగనంపిన వారిలో సౌదీ, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ దేశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధి ప్రావిన్స్‌కు చెందినవారు సుమారు 2,795 మంది ఉండగా.. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437, కేపీ నుంచి 1,002, బలూచిస్థాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారని తేలింది. ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ.. దేశంలో బిచ్చగాళ్లు ఓ పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. దీంతో ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తేలింది.. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయిలు అని అతడే అందరి ముందు వెల్లడించారు. సియాల్ కోట్ నుంచి వారిని రెండుసార్లు పంపించగా.. మళ్లీ తిరిగి వచ్చారని అన్నాడు.
- Tags
- 000 Beggars
- 5
- Beggars
- Malaysia
- Oman
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!