RUSSIA UKRAINE WAR: వెలుగులోకి రష్యా అకృత్యాలు.. ఉక్రెయిన్ సైనికులకు చిత్రహింసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RUSSIA UKRAINE WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ దేశం తగ్గేదేలే అన్నట్లు పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టింది. ఈ తాలూకా ఆధారాలు కొన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలలుగా యుద్ధం చేస్తున్న మాస్కో సైన్యం ఇజియం నగరాన్ని చిత్రహింసలకు కేంద్రంగా మార్చుకుంది. ఇజియం నగరంలో ఉక్రెయిన్ సైనికులు, పౌరులను రష్యా సేనలు చిత్రహింసలకు గురిచేసిన పదిప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజియం నగరంలో ఉన్న పది చిత్రహింస కేంద్రాలను అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ సందర్శించింది. డార్క్ రూంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం. అక్కడనుంచి తప్పించుకున్న 15 మంది ఉక్రెయిన్ సైనికులు తాము అనుభవించిన నరకాన్ని మీడియాతో వెల్లబోసుకున్నారు. చిత్రహింసలకు తాళలేక ఎనిమిది మంది అక్కడే చనిపోయినట్లు చెప్పారు. అందులో ఒకరు పౌరుడని బాధిత కుటుంబాలు తెలిపారు.
Read Also: Election Survey: గుజరాత్‌లో మళ్లీ వికసించేది కమలమే..!!
Also Read
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
ఇజియం అటవీ ప్రాంతంలోని శ్మశానవాటికలో 447 సమాధులను తవ్వగా అందులో 30 మృతదేహాలపై చిత్రహింసల ఆనవాళ్లు ఉన్నాయి. చేతులు కట్టేసినట్లు, అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చిన గాయాలు, కత్తిగాట్లు, విరిగిపోయిన అవయవాలు కనిపించినట్లు ఖార్కివ్‌లో ప్రాసిక్యూషన్ ఆఫీస్ తెలిపింది. సామూహిక ఖననాలు చేసిన చోట మృతదేహాల చేతులు కట్టేసి ఉన్నట్లు పేర్కొంది. ఇదే నగరంలో మరో రెండు భారీ సామూహిక శ్మశానవాటికలు బయటపడినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి.
Read Also:UP Durga Puja: దుర్గపూజలో అపశృతి.. చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే రష్యా ఆక్రమించిన ఇజియం నగరాన్ని కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక్కడ గాయపడిన వందలాది మందికి చికిత్స చేసిన వైద్యుడు కూడా మాస్కో సైనికుల చిత్రహింసలను ధ్రువీకరించారు. తన వద్దకు చేతులు, కాళ్లపై తుపాకీ గాయాలు, విరిగిన ఎముకలు, తీవ్రమైన కాలిన గాయాలతో వచ్చేవారని తెలిపారు. ఈ గాయాలు ఎలా అయ్యాయో చెప్పేవారు కాదన్నారు. గాయాలతో వచ్చిన సైనికులు కూడా అవి ఎలా అయ్యాయో చెప్పేందుకు ఇష్టపడలేదని వైద్యుడు తెలిపారు.
తాజావార్తలు
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!