King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King 100 Glimpse: కింగ్ నాగార్జున అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగార్జున.. ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
నాగార్జున బర్త్ డే సర్ప్రైజ్ గా ఆగస్టు 29న ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్ మరింత ప్రత్యేకంగా మారనున్నాయి. కేవలం గ్లింప్స్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ పై కూడా అదే రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అక్కినేని అభిమానుల్లో ఈ అప్డేట్పై ఆసక్తి మరింత పెరిగింది. మరో రెండు రోజుల్లో ఈ సర్ప్రైజ్ ను అభిమానులు ఆస్వాదించబోతున్నారు.
Also Read
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
దర్శకుడు రా. కార్తీక్ ఈ ప్రతిష్టాత్మక మూవీని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన కథ, పాత్రలపై చిత్ర బృందం ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు వెల్లడించకపోవడంతో గ్లింప్స్‌లో ఏం చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ఇక ‘కింగ్ 100’ కథ విషయానికి వస్తే.. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కథ సాగుతుందని సమాచారం. పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగే ప్రయాణాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ అంశాలతో మేళవించి దర్శకుడు రా. కార్తీక్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు నాగార్జునకు ఉన్న మాస్ ఇమేజ్‌కు సరిపోయే కమర్షియల్ అంశాలు కూడా ఇందులో ఉండనున్నాయని టాక్.
ఈ సినిమాలో నాగార్జున ఒకే తరహా పాత్రలో కనిపించబోరని సమాచారం. దాదాపు 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వివిధ దశల్లో ఆయనను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన లుక్, గెటప్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. నాగార్జున కెరీర్లో ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే 100వ సినిమాలో మరింత విభిన్నమైన షేడ్స్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తారాగణం విషయానికి వస్తే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టబు, సుష్మిత భట్, విజయేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. నాగార్జున, టబు కాంబినేషన్‌పై కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. గతంలో వీరిద్దరి కలయికకు మంచి గుర్తింపు ఉండటంతో ‘కింగ్ 100’లో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నాగార్జునకు 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కేవలం మరో కమర్షియల్ మూవీగా కాకుండా ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ఒక సెలబ్రేషన్‌గా నిలిచేలా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కింగ్ నాగార్జున 100వ సినిమా గ్లింప్స్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!