Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamabad: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం వార్డులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, అగ్నిప్రమాదం జరిగిన వార్డులోనే ఉన్న 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోనే అత్యంత ఆధునిక వైద్య సౌకర్యాలు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా PIMS గుర్తింపు పొందింది. ప్రమాదం జరిగే సమయంలో ఆ వార్డులో 15 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారని, ఈ దుర్ఘటనలో వారంతా ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికార ప్రతినిధి డాక్టర్ అనీజా జలీల్ అధికారికంగా ధ్రువీకరించారు. సమాచారం అందుకోగానే రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఏసీ యూనిట్‌లోని ఆక్సిజన్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోవడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ.. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన మొత్తం నష్టంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విషాదకర సంఘటనతో ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రత, అత్యవసర రక్షణ చర్యల నిర్లక్ష్యంపై తీవ్రమైన విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై వెంటనే విచారణ జరపాలని షరీఫ్ అధికారులను ఆదేశించారు. ఈ విషాద సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొంటూ.. అమాయక పిల్లల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!