Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood director Pavan Sadineni Arrest: పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీసిన ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్ అయ్యాడు. ఓ లేడీ ఆర్టిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను మోసం చేశాడని, చాలాకాలం పాటు సహజీవనం చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. అనంతరం మోసం చేశాడని సదరు ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది.
అరెస్ట్ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం డైరెక్టర్ పవన్ సాదినేనిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పవన్ సాదినేని టాలీవుడ్లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ప్రస్తుతం పవన్ సాదినేని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దుల్కర్ సినిమాపై పవన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇంతలోనే అతడిపై లేడీ ఆర్టిస్ట్ ఫిర్యాదు చేసింది. పవన్ అరెస్ట్ వార్త టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసులో వాస్తవాలు ఏంటి?.. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏవి? అనే విషయాలు విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!