Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా ప్రపంచ చమురు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఈ మార్గంలో వివాదాలే ఇరు దేశాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణమైన నేపథ్యంలో, ఇక్కడ రాకపోకలు పునఃప్రారంభమైతే అంతర్జాతీయ ఇంధన విపణికి పెద్ద ఊరట లభించనుంది. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. కానీ.. అమెరికా లేదా ఇరాన్ ప్రభుత్వాలు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. ఈ సీజ్ఫైర్ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే, పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు సదుమణిగి, గ్లోబల్ ట్రేడ్ మళ్లీ యథాస్థితికి చేరుకుంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!