Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లోని రసువా జిల్లాను బుధవారం ఉదయం సంభవించిన భీకర వరదలు గ్రామాలను ముంచెత్తాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. నదీ తీర ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే, ఒడ్డున ఉన్న జనావాసాలు కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్థానికులు వరద ఉద్ధృతికి ఏ విధంగా కొట్టుకుపోయారో ఊహించుకుంటేనే గుండెలు విసిగిపోతున్నాయి.
ఈ దెబ్బకు రసువా జిల్లాలోని అనేక కీలక ప్రాంతాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరగయ గ్రామీణ మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు చమేలీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ వంటి దాదాపు డజనుకు పైగా గ్రామాలు ఈ హఠాత్ వరద దాటికి గురయ్యాయి. ప్రస్తుతానికి మరణాలు, గాయపడినవారు, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక గణాంకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. అయితే స్థానిక అధికారులు, ప్రజలు, భద్రతా సంస్థల సమాచారం ప్రకారం నష్టం ఊహకందని స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీయగా, వెయ్యి మందికి పైగా వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
బాధితులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నేపాల్ ఆర్మీ చీఫ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల సుమారు 4,000 మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పరిస్థితి అత్యంత గంభీరంగా మారడంతో నేపాల్ రెడ్ క్రాస్ తన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను వెంటనే అప్రమత్తం చేసి, సహాయక చర్యల్లోకి దించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ (IFRC) కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు.
సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం వెంటనే రెండు సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులను సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రసువా జిల్లాకు రప్పిస్తున్నారు. వరద తీవ్రతపై హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించగా, ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని 5 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు