Russia – Ukraine War: ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై మూడు నెలలకుపైగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా డోన్బాస్ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచ్చిందని మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకున్నామని చెప్పిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ.. పొపాస్నా, లీమన్, స్వియాటోహిర్స్‌క్ సహా 15కు పైగా నగరాలు తమ చేతికి చిక్కినట్లు వెల్లడించారు. అటు ఉక్రెయిన్ సైతం.. డొనెట్స్క్లో సగం ప్రాంతం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిందని అంగీకరించింది. అయితే.. ఈ ఎదురుదెబ్బలకు కుంగిపోవద్దని, వీధి పోరాటాలతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని డోన్బాస్‌వాసులకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది.
ఇదిలావుండగా.. ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్‌కు మరింత సైన్యాన్ని తరలిస్తోంది. పశ్చిమ దేశాలు సైతం ఉక్రెయిన్‌కు సహకారం అందించడం కోసం అత్యాధునిక ఆయుధాల్ని అందిస్తున్నాయి. అటు.. అమెరికా అందించిన అత్యాధునిక మల్టిపుల్ రాకెట్ లాంచర్ల వాడకంపై సైన్యానికి ఉక్రెయిన్ శిక్షణ ఇస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధనం చేసుకోవాలని రష్యా సేనలు విశ్వప్రయత్నాలు చేయగా.. ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూడు నెలల తర్వాత కీవ్‌లో నాటక ప్రదర్శనలకు ప్రఖ్యాతి గాంచిన పోదిల్ థియేటర్ తెరుచుకోగా.. తొలి మూడు నాటక ప్రదర్శనలు హౌస్‌ఫుల్ అయ్యాయి.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
కాగా.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఇప్పటివరకూ 31 వేల రష్యా సైనికులు మరణించినట్టు సమాచారం. కానీ, ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచుతోంది. తాజా దాడుల్లో కల్నల్ వ్లాదిమిర్ నిగ్మతులిన్ (46) మరణించడంతో.. ఈ యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్ సంఖ్య 50కి చేరింది. అలాగే.. మేజర్ జనరల్ రోమన్ కుజుతోవ్, లెఫ్టినెంట్ జనరల్ బెర్డ్‌నికోవ్ మరణంతో.. మొత్తం 12 మంది రష్యా జనరల్స్ మరణించినట్టు తేలింది.
తాజావార్తలు
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..