Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదన్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నారా? లేదా ? అంటూ ప్రశ్నించారు. బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం వాస్తవం కాదా ? అన్నారు. దీనిపై రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మాట్లాడితే బాగుండేదని ఎద్దేవ చేశారు. అయ్యప్ప మాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘనందన్ రావు. రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల తీసిన తర్వాత అన్నింటికీ సమాధానం చెబుతా! అంటూ తెలిపారు. రఘునందన్ రావు అక్రమంగా సంపాదించి ఉంటే.. అధికారంలో ఉన్న మీరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్.!
పఠాన్ చెరువు పరిశ్రమల్లో నేను డబ్బు వసూలు చేస్తే ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇన్నాళ్లు ఎందుకు విచారణ చేయడం లేదు ? అని మండిపడ్డారు. రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నా ఆస్తులను ప్రకటిస్తా? మీ ఆస్తులను ప్రకటిస్తారా? అంటూ సవాల్ విసిరారు. రోహిత్ రెడ్డికి ప్రగతి భవన్ ఆశీస్సులు తప్ప సొంత బలం లేదని ఎద్దేవ చేశారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక.. తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలుచేశారు. ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తులను ప్రకటిస్తారా? అంటూ సవాల్ విసిరారు. నేను ఆస్తులను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న, దుబ్బాక నియోజకవర్గం.. సిద్దిపేట, గజ్వేల్ తో పోటీ పడుతుందని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!