Putin Warns: ఉక్రెయిన్‌కు సహకరించే ఏ దేశనైనా తమ సైన్యం టార్గెట్ గా చేసుకుంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందన్నారు. ఎలాంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదన్నారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న సన్నిహిత సైనిక సంబంధాలు ఇరు దేశాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం అన్నారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు సపోర్టుగా ఆ దేశంలో ఇతర దేశాల సాయుధ దళాలను మోహరించాల్సిన అవసరం ఏముందని పుతిన్ ప్రశ్నించారు.
Read Also: Kadapa: జిల్లా కేంద్రాన్నే మార్చేసిన పెన్నానది..
అయితే, తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటుందని పుతిన్ తెలిపారు. 26 ఐరోపా దేశాల నేతలు గురువారం నాడు పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయినా నేపథ్యంలో రష్యా అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, సెప్టెంబర్ 4న పారిస్‌లో కీవ్‌కు కావాల్సిన భద్రతను కల్పిస్తామని ఐరోపా నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అమెరికా తరఫున ఈ సమావేశంలో ఆ దేశ ప్రత్యేక రాయబారి విట్కాఫ్ హాజరయ్యారు. ఈ భేటీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వం వహించారు.