Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు
- ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు
- ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్‌తో ఎలాంటి రకమైన యుద్ధానికీ రష్యా సిద్ధం కావడం లేదని స్పష్టం చేశారు. యూరప్ దేశాలపై రష్యా దాడికి సిద్ధమవుతోందంటూ కొందరు యూరప్, నాటో సభ్య దేశాలు చేస్తున్న హెచ్చరికలను తోసిపుచ్చారు. అదే సమయంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను పునఃప్రారంభించే ప్రతిపాదనలు ఇంకా తమ ముందే ఉన్నాయని తెలిపారు. శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మీడియాతో మాట్లాడిన పుతిన్.. యూరప్ దేశాలతో ఉద్రిక్తతలను పెంచుకోవాల్సిన అవసరం రష్యాకు ఏ మాత్రం లేదన్నారు. రష్యా విస్తృత స్థాయి ఘర్షణకు సిద్ధమవుతోందంటూ వస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.
రష్యా నేరుగా నాటో దేశాలతో ఘర్షణకు దిగాలని చూస్తోందన్న వాదనలను క్రెమ్లిన్ గతంలోనూ ఖండించింది. నాటో సభ్య దేశాల్లో విధ్వంసక చర్యలు, హైబ్రిడ్ ఆపరేషన్లకు రష్యా పాల్పడుతోందన్న ఆరోపణలను కూడా మాస్కో తిరస్కరిస్తూ వస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా నుంచి డ్రోన్ కార్యకలాపాలు, విధ్వంసక చర్యలు, ఇతర రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆందోళనలు పలు యూరప్ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
ఈ నెల ప్రారంభంలో జర్మనీ.. ఆగస్టులో లైప్జిగ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడికి రష్యా ప్రణాళిక రూపొందించిందని ఆరోపించింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని పోలాండ్ కూడా హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను రష్యా అంగీకరించడం లేదు. నాటో దేశాలతో నేరుగా ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు లేదని క్రెమ్లిన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.
శాంతి చర్చలకు అవకాశం
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను మళ్లీ ప్రారంభించే అవకాశంపైనా పుతిన్ మాట్లాడారు. చర్చలను పునఃప్రారంభించేందుకు వచ్చిన ప్రతిపాదనలు ఇంకా తమ ముందే ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఇటీవల ఉక్రెయిన్ తమ భూభాగంపై జరిపిందని రష్యా చెబుతున్న దాడుల నేపథ్యంలో తదుపరి చర్యలపై ముందుగా ఆలోచించాల్సి ఉందని పుతిన్ అన్నారు.
పుతిన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా పూర్తిగా తలుపులు మూసివేయలేదు. అయితే ఇటీవలి దాడులపై తమ స్పందనను నిర్ణయించిన తర్వాతే తదుపరి అడుగులు వేయాలని మాస్కో భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
- Tags
- Europe
- Putin
- Russia
- Vladimir Putin
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?