పంజ్ షీర్ పై డ్రోన్లతో దాడి.. తాలిబన్ల వశం చేసిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు.
గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ భూభాగంలోకి రాకుండా అడ్డుకుంటున్న పంజ్ షీర్ సైన్యానికి ప్రపంచ దేశాల నుంచి ఏమాత్రం సహాయం లభించడం లేదు. ఇదే అదనుగా తాలిబన్లు ఆల్ ఖైదా, పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పంజ్ షేర్ పై దాడికి పాల్పడుతున్నారు. మూకుమ్మడిగా వీరంతా పంజ్ షేర్ పై పోరు చేస్తుండటంతో పంజ్ షేర్ సైన్యం క్రమంగా వీరులను కోల్పోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా తాలిబన్లు పంజ్ షేర్ లోయను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించడం సంచలనంగా మారింది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
తాలిబన్లు పంజ్ షేర్ పై డ్రోన్లతో దాడి చేస్తుండటంతో రెసిస్టెంట్ ఫోర్స్ అలిసిపోతోంది. పంజ్ షేర్ సైన్యానికి సాయం అందించడంలో ప్రపంచ దేశాలు మొండికేస్తుండగా తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్ బహిరంగగానే మద్దతు పలుకుతోంది. ఇన్నాళ్లు తాలిబన్లకు మేం సాయం చేయడం లేదని చెప్పిన దాయాది దేశం తాజాగా పంజ్ షేర్ కు డ్రోన్లను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డ్రోన్లతో పంజ్ షేర్ సైన్యంపై దాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రెసిస్టెంట్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి ఫాహీమ్ దాస్తీ అమరుడైనట్లు వార్తలు వస్తున్నాయి.
తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో దాస్తీ ఒకరు. యుద్ధంతో చిన్నాభిన్నామైన ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు తమ దళాలు చనిపోయేందుకు కూడా సిద్ధమేనని దాస్తీ ఒక సందర్భంలో వెల్లడించారు. గతంలోనూ ఈయన వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. 9/11దాడికి ముందు పంజ్ షేర్ నాయకుడు అహ్మద్ మసూద్ పై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. అయితే దాస్తీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రస్తుతం పంజ్ షేర్ దళాలకు దాస్తీనే అధికార ప్రతినిధిగా ఉన్నారు. తరుచూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ ఎన్ఆర్ఎఫ్సీ దళాల సమాచారాన్ని మీడియాకు అందిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ‘మేం ప్రతిఘటిస్తూ మరణిస్తే.. అది మా విజయం అవుతుందని.. దేశం కోసం తుదిరక్తం చుక్క వరకు పోరాడిన యోధులుగా చరిత్రలో మా పేరు లిఖిస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడిలో దాస్తీతోపాటు అహ్మద్ షా మసూద్ మేనల్లుడు సాహిబ్ అబ్దుల్ వాదూద్ కూడా అమరులైనట్లు తెలుస్తోంది. తాము ఇద్దరు కీలక నాయకులను కోల్పోయినట్లు ఎన్ఆర్ఎఫ్ఏ ఫేస్ బుక్ పేజీలో ఆ దళవర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు అప్ఘన్లో యుద్దాన్ని ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు పంజ్ షేర్ దళాలు సానుకూలంగా స్పందించాయి. ‘ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమేనని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని.. తక్షణమే తాలిబన్లు పోరాటాన్ని నిలపివేసి చర్చలు జరుపాలని’ పంజ్ షేర్ అధినేత మసూద్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. అయితే మతపెద్దల సూచనలపై తాలిబన్లు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా పంజ్ షేర్ దళాలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా విద్యుత్, టెలిఫోన్, కరెంట్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. దీంతో తాలిబన్లు ఏకపక్షంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!