పవన్ కళ్యాణ్ గురించి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ముందుగా స్పీచ్ మాట్లాడిన సమయంలో మరిచిపోయానంటూ… మరోసారి మైక్ తీసుకున్న శంకర్ టైం తక్కువ ఉందని కంగారు పెడితే ఏమేం మాట్లాడాలో మరిచిపోయాను అంటూ ఆయన కామెంట్ చేశారు.
Shankar: గేమ్ చేంజర్ స్టోరీ లీక్ చేసేసిన శంకర్
నా కూతురు పెళ్లి కోసం ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఎంతో గౌరవం, ఎంత మంచి బిహేవియర్ కొన్ని క్షణాల్లోనే నేను ఆయనకు ఇంప్రెస్ అయిపోయాను. ఒక మాటలో చెప్పాలంటే కేవలం హృదయాలను మాత్రమే చూసే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. అలాంటివాళ్లు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్ కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అంటూ శంకర్ కామెంట్ చేశారు.