Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న సంబంధాలు భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. షేక్ హసీనా గతేడాది పదవీచ్యుతి తర్వాత ఆమె భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మారారు. అప్పటి నుంచి అతను పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్ని రోజులుగా పాకిస్తాన్‌కు చెందిన కీలక సైనికాధికారులు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, ఐఎస్ఐ అధికారులు భారత సరిహద్దుల్లో పర్యటించడం ప్రమాదకరంగా మారింది.
Pakistan-Bangladesh: గతేడాది హింసాత్మక విద్యార్థి అల్లర్ల తర్వాత, షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఈయన హయాంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం చిగురిస్తోంది.
Pakistan Navy Warship PNS Saif Visits Bangladesh: గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. పాకిస్థాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక, PNF SAIF, నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుందని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు.
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్‌కి దగ్గరవుతోంది.