Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్‌లో కంగారు పెట్టిస్తోంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో తేల్చుకోని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. మరోవైపు, ఇరాన్‌పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్‌లో గొడవకు కారణమైందని అక్కడి రాజకీయ నాయకులు చెప్పారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖాదీర్ పటేల్ ఇజ్రాయిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య కేవలం ఒకే దేశం మిగిలి ఉంది అది ఇరాన్. ఇరాన్ వరకు ఇప్పటికే వారి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మాత్రమే మిగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా తర్వాత టార్గెట్ పాకిస్తానే అవుతుంది’’ అని ఖాదీర్ అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ.. ఈ చెంచాగిరి, ఈ ఒప్పందాలు మిమ్మల్ని రక్షించవు అని అన్నారు. యుద్ధంలో మరణించిన ఖమేనీని ఆయన అమరవీరుడిగా కొనియాడారు.
Also Read
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
Read Also: Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
మరో ఎంపీ అలీ మహ్మద్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీరు ఏమనుకుంటున్నారు.? టార్గెట్ ఇరాన్ మాత్రమే అని అనుకుంటున్నారా.? ఇరాన్ ఒక కారణం మాత్రమే, అసలు టార్గెట్ పాకిస్తాన్’’ అని హెచ్చరించారు. గతంలో ఇజ్రాయిల్ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, పాక్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులారా, మీ దేశం గురించి ఆందోళన చెందండి, ఇబ్బంది వస్తోంది. మీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి’’ అని అన్నారు.
గతంలో పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఇజ్రాయిల్ ప్రధాని గురియన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒక సిద్ధాంతనికి ప్రతిస్పందనగా ఏర్పడిన దేశం. అది మిత్రదేశం ఇండియాను విభజించి రూపొందించబడింది అని అన్నారు. ఇరాన్,కు నష్టం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్‌పై ఉంటుందని పాక్ నేతలు హెచ్చరించారు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి జరిగింది. లాహోర్, ఇస్లామాబాద్, స్కర్దు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 10 మందికిపైగా మరణించారు. 90 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!