Jana Nayagan : జననాయగన్ రిలీజ్‌కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిసున్న సంగతి తెలిసిందే. కానీ తన సినీ కెరీర్లో నటించిన 69వ చిత్రం అలాగే ఆఖరి సినిమా అయిన ‘జననాయగన్‘ విడుదల మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన జననాయాగన్ గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెలలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లోనే చిత్ర యూనిట్ ఈ సినిమాను సెన్సార్ బోర్డ్‌కు పంపించింది. అయితే కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు మరియు సాంకేతిక కారణాల వల్ల సెన్సార్ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సెన్సార్ సమస్యలు పరిష్కారం అయ్యాయని త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ రాబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం కావడంతో భారీ స్థాయిలో సెలెబ్రేషన్స్ చేసేందుకు విజయ్ అభిమానులు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా విజయ్ రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్‌లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ఆల్రెడీ మొత్తం సినిమా హై క్వాలిటీతో లీక్ అయినా కూడా దళపతిని వెండితెరపై ఆఖరిసారిగా చూడటానికి మరియు థియేటర్లలో ఒక భారీ పండగ వాతావరణాన్ని సృష్టించడానికి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
Also Read
- Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
- TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
- Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
- Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!