Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durefishan Saleem: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియాలో తరచూ రూమర్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్లు షికారు నిమిషాలలోనే షికార్లు చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే పాకిస్తాన్ సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెలివిజన్ నటి దురేఫిషన్ సలీమ్ ప్రముఖ యూట్యూబర్, టిక్‌టాకర్ రజబ్ బట్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మరింత వైరల్‌గా మారింది. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలు దురేఫిషన్ సలీమ్, రజబ్ బట్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ వివాహానికి కూడా సిద్ధమవుతున్నారని పేర్కొంటూ పోస్టులు షేర్ చేశాయి. ఈ పోస్టులు క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే చాలా మంది నెటిజన్లు ఈ వార్తలను ఆధారాలు లేని గాసిప్‌గా కొట్టిపారేశారు.
ఈ వ్యవహారంలో దురేఫిషన్ మేకప్ ఆర్టిస్ట్ యశ్వా అంజుమ్ చేసిన కామెంట్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వైరల్ అవుతున్న పోస్టులలో ఒకదానికి స్పందించిన ఆమె, ఈ వార్త విని తాను పూర్తిగా షాక్ అయ్యానని తెలిపింది. ఇలాంటి వార్తలు చూడకపోయినా, వినకపోయినా బాగుండేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, దురేఫిషన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అస్సలు జరగదని, కోటి సంవత్సరాలు గడిచినా అలాంటి విషయం సాధ్యం కాదని స్పష్టంగా రాసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, పెళ్లి వార్తలకు ఎలాంటి నిజం లేదనే అభిప్రాయం మరింత బలపడింది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
అయితే ఇప్పటివరకు ఈ ప్రచారంపై దురేఫిషన్ సలీమ్ కానీ, రజబ్ బట్ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ ప్రస్తుతం కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దురేఫిషన్ సలీమ్ 2020లో ‘దిల్ రుబా’ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘కైసీ తేరీ ఖుద్గర్జీ’, ‘ఇష్క్ ముర్షిద్’, ‘సన్వాల్ యార్ పియా’ వంటి టెలివిజన్ సీరియల్స్‌తో పాకిస్తాన్లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గాను హమ్ అవార్డ్స్ నామినేషన్లు కూడా అందుకున్నారు.
ఇక రజబ్ బట్ విషయానికి వస్తే, ఆయన పాకిస్తాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్లలో ఒకరు. యూట్యూబ్‌లో తొమ్మిది మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ఆయన ఫ్యామిలీ వ్లాగ్స్, లైఫ్‌స్టైల్ వీడియోలతో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల సొంత లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటింగ్, పెళ్లి వార్తలపై ఇద్దరిలో ఎవరూ స్పందించకపోవడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారాన్ని నిర్ధారించలేమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- cinema
- Durefishan Saleem
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!