Pakistan-Bangladesh: తలుపులు మూసిన భారత్.. బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ ఆఫర్..
- బంగ్లాదేశ్‌కు కరాచీ పోర్ట్‌ని ఆఫర్ చేసి పాకిస్తాన్..
- భారత్‌తో ఉద్రిక్తల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోయి భారత్‌కు వచ్చేసింది. దీని తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. పాకిస్తాన్‌తో స్నేహం చేస్తూ, దేశంలో రాడికల్ ఇస్లామిస్టులను రెచ్చగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, భారత్ బంగ్లాదేశ్‌కు బుద్ధి వచ్చేలా పలు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే భారత్, జనపనార ఉత్పత్తులను దిగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్ జూట్ దిగుమతులకు భారత్ తలుపులు మూసివేసింది.
అయితే, దీనిని అదునుగా తీసుకుని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. జనపనారతో పాటు ఇతర వస్తువుల ఎగుమతుల కోసం తమ కరాచీ ఓడరేవును ఉపయోగించుకునే అవకాశాన్ని అందించింది. దాదాపుగా 20 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ -బంగ్లాదేశ్‌ల మధ్య ఢాకాలో జాయింట్ ఎకనామిక్ కమిషన్ (జెఇసి) సమావేశం జరిగింది. దీంట్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
Also Read
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
Read Also: Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తు్న్న నేపథ్యంలో, పాకిస్తాన్ బంగ్లాకు దగ్గర అవుతోంది. 1971 యుద్ధం ముందు పాకిస్తాన్ చేసిన దురాగతాలను బంగ్లాదేశ్ మరిచిపోయి వ్యవహరిస్తోంది. వారికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన భారత్‌కు వ్యతరేకంగా వ్యవహరిస్తోంది. ఐదు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ కార్గో షిప్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఓడరేవుకు వచ్చింది. తాజా ఒప్పందమే కాకుండా, బంగ్లాదేశ్ జనపనార ఎగుమతుల్ని పెంచడానికి పాకిస్తాన్ జనపనారతో పాటు ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించిందని బంగ్లా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ జనపనార దిగుమతులపై 2 శాతం కస్టమ్ సుంకాన్ని పాకిస్తాన్ తగ్గించింది. మరోవైపు, భారత్ నుంచి బంగ్లాకు మామిడి ఎగుమతులు తగ్గడంతో ఈ గ్యాప్‌ని భర్తీ చేయాలని పాక్ భావిస్తోంది. తమ మామిడి ఎగుమతుల కోసం అనుమతులు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది.
గతంలో, బంగ్లాదేశ్ నుండి నేసిన బట్టలు మరియు రెడీమేడ్ దుస్తులను భూ మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం నిషేధించింది. బదులుగా, ఈ వస్తువులను నవీ ముంబైలోని నవా షెవా సముద్ర ఓడరేవు ద్వారా ప్రవేశించడానికి అనుమతించారు. అయితే, ఇది బంగ్లాదేశ్ ఎగుమతులకు లాభదాయకం కాదు. భూ సరిహద్దు దాడటం కాకుండా, సముద్రం గుండా వస్తువులను తరలించడం బంగ్లా ఎగుమతిదారులకు ఖర్చుతో కూడుకున్నది.
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!