Pakistan-Bangladesh: గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోయి భారత్‌కు వచ్చేసింది. దీని తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. పాకిస్తాన్‌తో స్నేహం చేస్తూ, దేశంలో రాడికల్ ఇస్లామిస్టులను రెచ్చగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, భారత్ బంగ్లాదేశ్‌కు బుద్ధి వచ్చేలా పలు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే భారత్, జనపనార ఉత్పత్తులను దిగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్ జూట్ దిగుమతులకు…
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్‌కి దగ్గరవుతోంది.